కపిలేశ్వరపురం: సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

1చూసినవారు
కపిలేశ్వరపురం ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారి రవి 75 కేజీల ధాన్యం బస్తా ధర రూ. 1777గా నిర్ణయించబడిందని, ఎకరాకు 58 బస్తాల చొప్పున కొనుగోలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు కట్టకుండానే నగదు పొందిన వారి నుంచి రికవరీపై పుత్సల శ్రీనివాస్ ఆరా తీయగా, పశువైద్యశాల నిర్వహణ, జలజీవన్ మిషన్ పనుల అసంపూర్తిపై ఎంపీటీసీలు అధికారులను ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని అచ్యుతాపురం ఎంపీటీసీ మధు అసహనం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :