అంగర పీహెచ్సీ వైద్యాధికారిగా రామకృష్ణ బాధ్యతలు

72చూసినవారు
అంగర పీహెచ్సీ వైద్యాధికారిగా రామకృష్ణ బాధ్యతలు
కపిలేశ్వరపురం మండలం అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా డాక్టర్ అనంత రామకృష్ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆలమూరు మండలం చొప్పెల్ల పీహెచ్సీ నుంచి బదిలీపై వచ్చినట్లు చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందిస్తానన్నారు. అదేవిధంగా వర్షాకాలం సమయం కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

సంబంధిత పోస్ట్