
పుదుచ్చేరి: మల్లాడికి పడవలతో ఘన స్వాగతం
పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు ఈరోజు రాజమండ్రి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో యానాం చేరుకోనున్నారు. ఆయన రాక సందర్భంగా నియోజకవర్గంలో భారీ సందడి నెలకొంది. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు మంత్రికి ఘనస్వాగతం పలికేందుకు తరలివచ్చారు. గోదావరి నదిలో పడవలకు పార్టీ జెండాలు కట్టి, ఫెర్రీ రోడ్డు వద్ద భారీ గజమాలతో ఆహ్వానించేందుకు అపూర్వ ఏర్పాట్లు చేశారు. మల్లాడి రాకతో యానాం వీధులన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి.





























