జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్య నారాయణరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాట్రేనికోన మండలం బంటుమిల్లికి చెందిన ఒక మహిళా రైతు వద్ద 600 బస్తాల ధాన్యం కొనుగోలు చేసి, నగదు ఇవ్వకుండా మోసం చేసిన వ్యాపారి శ్రీనివాసరావుపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు జోక్యం చేసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.