మురమళ్ల–పల్లంకుర్రు కాలువ క్లోజర్ పనుల్లో జాప్యం

5చూసినవారు
మురమళ్ల పల్లంకుర్రు ప్రధాన పంట కాలువలో చేపట్టిన మరమ్మతు పనులు నెమ్మదిగా సాగుతున్నాయని స్థానిక రైతులు విమర్శిస్తున్నారు. కాలువ రక్షణ గోడ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. ఆదివారం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాగునీరు విడుదల చేయడంతో పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి ప్రవాహం పెరిగితే పనులు నిలిచిపోయి, సాగుకు ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్