కాట్రేనికోనలో డ్రైనేజీ ప్రక్షాళన పనులు ముమ్మరం

9చూసినవారు
కాట్రేనికోన మండల కేంద్రంలో వర్షాకాలం నేపథ్యంలో మురుగునీటి సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీల్లో పూడికతీత పనులు చురుగ్గా జరుగుతున్నాయి. బుధవారం ఈ పనులను పర్యవేక్షించిన పంచాయతీ కార్యదర్శి జె. వి. వి సత్యనారాయణ, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతో సిల్టును తొలగించి ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. గ్రామ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రజలందరూ సహకరించాలని, డ్రైనేజీలను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్