ముమ్మిడివరం ఇంధన కొరతపై మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆందోళన

4చూసినవారు
ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పెట్రోల్ బంకు వద్ద మంగళవారం ఇంధన కొరతతో ఏర్పడిన రద్దీని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్ పరిశీలించారు. వారం రోజులుగా ఇంధన కొరతతో ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ లభించక రైతులు, ఆక్వా సాగుదారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పొన్నాడ సతీశ్ పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you