కాట్రేనికోన శాఖా గ్రంథాలయాన్ని పరిశీలించిన ఎంపీడీవో

4చూసినవారు
కాట్రేనికోన శాఖా గ్రంథాలయాన్ని బుధవారం ఎంపీడీవో రాజేశ్వర్ రావు సందర్శించారు. ఆయన అక్కడి పుస్తకాలు, రికార్డులను పరిశీలించి, గ్రంథాలయానికి అవసరమైన మౌలిక వసతుల గురించి లైబ్రేరియన్ తులసిలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్ శాఖ సహాయ ఇంజినీర్‌తో మాట్లాడి, గ్రంథాలయానికి తక్షణమే విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఇన్‌ఛార్జ్ పంచాయతీ కార్యదర్శి రామారావును ఆదేశించారు. గ్రంథాలయ భవన మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరగా రూపొందించాలని ఇంజినీరింగ్ అసిస్టెంట్ మురళికి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్