ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంకలో మంగళవారం ఒక ఇంటి ఆవరణలో తాచుపాము కలకలం సృష్టించింది. కొత్తూరి వీరవెంకటకృష్ణం రాజు ఇంటి ఆవరణలోని కోళ్ల గూటిలోకి ప్రవేశించిన పాము, కోళ్లను చంపి తిన్నది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ వెంటనే స్పందించి, పామును చాకచక్యంగా బంధించి, జనసంచారం లేని ప్రాంతంలో వదిలిపెట్టారు.