ముమ్మిడివరం కాశీవాని తూము వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. టీవీఎస్ ఎక్సెల్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా ఆవు అడ్డు రావడంతో, దానిని ఢీకొని ఆయన కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వృద్ధుడి తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, హైవే అంబులెన్స్‌లో ఆయన్ను ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.