ముమ్మిడివరం నియోజకవర్గ
వైసీపీ కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన దుర్మార్గమని విమర్శించారు. గురువారం ముమ్మిడివరంలో, గత ముఖ్యమంత్రి
జగన్ ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కోసం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.