ముమ్మిడివరంలో వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో పోస్టర్‌ను ఆవిష్కరించారు. నియోజకవర్గ వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విఫల పాలనపై వారు విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన రాష్ట్ర, నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.