ముమ్మిడివరం: ధాన్యం కొనుగోలు సిబ్బందికి శిక్షణ తరగతులు

84చూసినవారు
ముమ్మిడివరం: ధాన్యం కొనుగోలు సిబ్బందికి శిక్షణ తరగతులు
జిల్లా సివిల్ సప్లై ఆఫీస్ లో కొత్తపేట డివిజన్ రైతు సేవా కేంద్రాల ధాన్యం కొనుగోలు సిబ్బంది శిక్షణా తరగతులు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ మోకా ఆనంద్ సాగర్ పాల్గొని ప్రసంగించారు. రైతులను దళారుల చేతులలో మోసపోకుండా, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే గిట్టుబాటు ధరలు గురించి వివరించారు. రైతులకు సిబ్బంది అండగా ఉండాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్