కాట్రేనికోన ఓల్డ్ అయినాపురం డ్రైన్‌లో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక కుమ్మరి వీధికి చెందిన రాయపూడి గణపతిరావు (75)గా గుర్తించారు. గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.