కందికుప్పలో మురుగు ముప్పు: నిలిచిపోయిన పూడికతీత పనులు

6చూసినవారు
కాట్రేనికోన మండలంలో డ్రైనేజీలు చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయి మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో పూడికలు తీస్తామని నీటి సంఘాల హామీలు నెరవేరడం లేదు. కందికుప్పలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో, మురుగునీటి సమస్య తీవ్రతరం కాకముందే డ్రైనేజీలను శుభ్రం చేయాలని గ్రామస్థులు శుక్రవారం డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్