ఈ నెల 26న కాకినాడలో "బుద్ధునితో నా ప్రయాణం" నాటకం

81చూసినవారు
ఈ నెల 26న కాకినాడలో "బుద్ధునితో నా ప్రయాణం" నాటకం
ఈనెల 26న కాకినాడ పాత బస్టాండ్‌లోని అంబేడ్కర్ భవనంలో “బుద్ధునితో నా ప్రయాణం డాక్టర్ అంబేడ్కర్” నాటక ప్రదర్శన జరుగనుంది. బుధవారం నాటక ప్రచార కరపత్రాన్ని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఎండియుడబ్ల్యూఎ నేతలు ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనకు డా. కె. రామ్ స్వరూప్ జవహర్ సహకారం అందించారు. హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు నాటకం వేస్తారు. కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్