వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి: ఐ.పోలవరం లో ఘన నివాళి

1042చూసినవారు
వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి: ఐ.పోలవరం లో ఘన నివాళి
ఐ.పోలవరం, కోనసీమ: రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని ఐ.పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అమరావతిని రాజధానిగా చేసుకొని పాలించిన జమీందారు, కవి పండిత పోషకుడు, వందకు పైగా దేవాలయాలను నిర్మించిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి విద్యాశాఖ అధికారులు ఎన్ కొండారెడ్డి, వి సురేష్ బాబులు పూలమాలలతో నివాళులర్పించారు. పిటిఎం సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నాయుడు పరిపాలనా దక్షతను కొనియాడారు.

సంబంధిత పోస్ట్