రాష్ట్రంలో నెలకొన్న డీజిల్ కొరతపై వైసీపీ రైతు విభాగం నాయకులు జున్నూరి బాబి, పితాని బాలకృష్ణ మంగళవారం అమలాపురంలో కలెక్టర్ మహేశ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. పొరుగు రాష్ట్రాల్లో ఇంధనం పుష్కలంగా లభిస్తున్నా, ఏపీలోనే కొరత ఉండటం ప్రభుత్వ వైఫల్యమని వారు విమర్శించారు. డీజిల్ లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.