నిడదవోలు మున్సిపల్ కార్మికులు (CITU) మంగళవారం కార్మిక వర్గ విముక్తి సిద్ధాంతకర్త కామ్రేడ్ కార్ల్ మార్క్స్ 208వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వలరాంబాబు మాట్లాడుతూ, ప్రస్తుతం కార్పోరేట్ శక్తులు కార్మికవర్గంపై దాడి చేస్తున్నాయని, లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికవర్గానికి ద్రోహం తలపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం కార్మికులకు, శ్రామిక మహిళలకు ఉద్యోగ భద్రత లేదని ఆయన పేర్కొన్నారు.