నిడదవోలు రూరల్ మండలం సురాపురంలో శుక్రవారం ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి కందులు దుర్గేష్, APSSDC ఛైర్మెన్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. అర్హులైన రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. సొంత భూముల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో వద్దన్న రైతుల కోరిక మేరకు, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.