ఇంధన సరఫరా సాధారణం – ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

1808చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షిస్తున్నట్లు జేసీ వై. మేఘా స్వరూప్ ఆదివారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, కమిషనర్, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజలకు, నిత్యావసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సరఫరాలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.