అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక గణపతి సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా విభిన్న ప్రతిభావంతులు ఉన్నత శిఖరాలకు చేరుకొనేలా సమాజం ప్రోత్సహించాలన్నారు. 1992లో UNO డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రకటించిందని తెలిపారు.