అంతర్రాష్ట్ర దొంగల సంచారం.. పెరవలి పోలీసుల కీలక సూచన

2391చూసినవారు
అంతర్రాష్ట్ర దొంగల సంచారం.. పెరవలి పోలీసుల కీలక సూచన
పెరవలి ఎస్ఐ ఎం. వెంకటేశ్వరరావు ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలోనూ అనేక చోరీలకు పాల్పడిందని, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చొరబడి దొంగతనాలకు పాల్పడుతోందని తెలిపారు. ప్రజలు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.