నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.