ప్రముఖ నిర్మాత ఆర్. బి. చౌదరి మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి

1చూసినవారు
ప్రముఖ నిర్మాత ఆర్. బి. చౌదరి మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'సూపర్ గుడ్ ఫిలిమ్స్' అధినేత ఆర్. బి. చౌదరి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి, చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న గొప్ప నిర్మాతను కోల్పోవడం సినీ రంగానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్