ఒంటరి మృతికి అంత్యక్రియలు నిర్వహించిన MRPS, MEF

3చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న ఈర్లగడ్డ వెంకటేశలు అనే ఎస్సీ వ్యక్తి అనారోగ్యంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న MRPS జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాలింకి రాము, MEF సంఘాల సభ్యులు వెంటనే స్పందించి, ఎవరి అండ లేని మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మానవతా కార్యక్రమంలో ఆరుగొలను శాంత కుమార్, సత్తి రాజు, రవికుమార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్