తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్‌లో ఒక వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదైంది. ఒడిశాకు చెందిన రంజాన్ అధికారి అనే వ్యక్తి, తన భార్యాపిల్లలతో కలిసి కోరుమామిడి కంచలమ్మ గుడి వద్ద నివాసం ఉంటూ, జీడి గింజల పరిశ్రమలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన భార్యాపిల్లలు వేరే పరిశ్రమకు వెళ్లడంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయిన రంజాన్ అధికారి తిరిగి రాలేదు. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.