గత నెల 2న నిడదవోలు-చాగల్లు రహదారిలో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడి తీవ్రంగా గాయపడిన
తెదేపా కార్యకర్త, సమిశ్రగూడెంకు చెందిన ఆటో డ్రైవర్ ముప్పిడి రాజు(32) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఈ ఘటనపై ఆయన భార్య భారతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిడదవోలు ఎస్సై బి. జయరాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజు కుటుంబానికి అండగా నిలవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.