పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఏపీ రూరల్ రోడ్స్ స్ట్రెంతింగ్ ప్రాజెక్టు తొలి దశ కింద నిడదవోలు నియోజకవర్గంలో 21 రహదారి మరమ్మతులు, నిర్మాణ పనులకు రూ. 28.89 కోట్ల నిధులు కేటాయించినట్లు నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందులు దుర్గేష్ బుధవారం తెలిపారు. కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభం అయ్యేలా ఆదేశాలు జారీ చేసిందని, నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.