నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు నిడదవోలు రూరల్ మండలంలోని కాటకోటేశ్వరం నుండి ఉనకరమిల్లి వరకు ఉన్న ప్రధాన రహదారికి అధికారులు మరమ్మతులు చేపట్టారు. గతంలో గుంతలమయంగా మారి ప్రయాణానికి భయంకరంగా ఉన్న ఈ రహదారిని, మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధతో సాఫీగా ప్రయాణించేలా తీర్చిదిద్దారు. ప్రజల విజ్ఞ
ప్తి మేరకు అధ్వాన్నంగా మారిన ఆర్ అండ్ బీ రహదారిని స్థానిక పంచాయతీ సహకారంతో సకాలంలో అందుబాటులోకి తీసుకురావడంతో, మంత్రి కందుల దుర్గేష్ స్పందనపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.