నిడదవోలు నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాల అభివృద్ధికి మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృషితో పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఎస్సీ/ఎస్టీ/బీసీ కాలనీల్లో భజన మందిరాల నిర్మాణానికి అనుమతులు లభించాయి. ఈ పరిణామంతో నిడదవోలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లనుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.