నిడదవోలు రూరల్ మండలం గోపవరం గ్రామంలో బుధవారం శ్రీశ్రీశ్రీ గుబ్బలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి కందుల దుర్గేష్, APSSDC చైర్మన్ బూరుగుపల్లి శేషారావు శంకుస్థాపన చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు, భూమి పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.