ఎగువన కురిసిన వర్షాల వల్ల ఎర్ర కాలువలో వరద ఉద్ధృతి పెరిగింది. మంగళవారం నిడదవోలు మండలం కంసాలిపాలెం-మాధవరం మధ్య కాజ్‌వేపై నీరు ప్రవహించడంతో తాడేపల్లిగూడెం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.