తూ.గో: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. లోపల 36 మంది..!

1చూసినవారు
తూ.గో: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. లోపల 36 మంది..!
నిడదవోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం చౌటుప్పల్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, నిడదవోలుకు చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశాలతో క్షతగాత్రులను చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్