ఉండ్రాజవరం: సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

70చూసినవారు
ఉండ్రాజవరం: సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో సోమవారం నిర్వహించిన "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్, నిడదవోలు టీడీపీ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్