
నత్త నడకగా సాగుతున్న వాటర్ ప్రాజెక్టు పనులు
సామర్లకోట రాజీవ్ గృహకల్ప సమీపంలో చేపట్టిన వాటర్ ప్రాజెక్ట్ పనులు నెల రోజులుగా నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంచినీటి సరఫరా కోసం మున్సిపల్ అధికారులు పైపులైన్ నిర్మాణాన్ని ప్రారంభించినా, పనులు పూర్తి చేయకుండా గోతులు తవ్వి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

































