భీమేశ్వర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

6చూసినవారు
భీమేశ్వర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు
సామర్లకోటలోని భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం హుండీల లెక్కింపు జరిగింది. ఈవో బల్ల నీలకంఠం, ఛైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ లెక్కింపులో స్వామికి రూ. 22,37,942 ఆదాయం లభించింది. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం రూ. 1,05,75,051 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. పాలకవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్