
ఖమ్మంలో మహిళ దారుణ హత్య
ఖమ్మం నగరంలోని కస్బా బజార్లో ప్రమీల అనే మహిళ శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. మృతురాలి మృతదేహం సమీపంలో కరెన్సీ నోట్లు లభించడంతో కలకలం రేగింది. పాల్వంచకు చెందిన ప్రమీల, నెల రోజులుగా భర్తకు దూరంగా ఖమ్మంలో నివసిస్తోంది. లేడీస్ హాస్టల్లో ఉంటూ షాపింగ్ మాల్లో పని చేస్తోంది. ఇటీవల శ్రవణ్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని భద్రాచలంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సదరు మహిళ రాత్రి హత్యకు గురికావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.




