వేట్లపాలెం ఘటనలో 24కు చేరిన మృతుల సంఖ్య

1చూసినవారు
సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వీర శ్రీను (39) బుధవారం మృతి చెందారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారని వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య 24కి చేరింది. ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సామర్లకోట కొమ్మర వీధి ప్రాంతంలో మృతుల సంఖ్య పెరగటంతో ఆ ప్రాంతం శోకసముద్రంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్