పెద్దాపురం మండలంలోని ఆనూరు, కొండపల్లి గ్రామాల్లో ఖరీఫ్-2026 సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. వ్యవసాయ అధికారి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు ముందస్తు వ్యవసాయ పనులు చేపట్టాలని, తక్కువ కాలపరిమితి వరి వంగడాలు ఎంచుకోవాలని, నానో యూరియా వాడాలని సూచించారు. రైతులు ఫార్మర్ ఐడి నమోదు చేసుకోవాలని, ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా వ్యవసాయ శాఖ సేవలు పొందవచ్చని తెలిపారు.