
బాలుడి మృతదేహం కోసం రూ.2వేలు డిమాండ్ చేసిన సిబ్బంది
ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో దారుణం చోటుచేసుకుంది. చెరువులో పడి మృతి చెందిన 3 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఆసుపత్రి సిబ్బంది రూ.2 వేలు డిమాండ్ చేశారు. గ్రామస్థులు చందాలు వేసుకుని రూ.వెయ్యి చెల్లించడంతో మృతదేహాన్ని అప్పగించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పాలనాధికారి అశుతోష్ కులకర్ణి విచారణకు ఆదేశించారు.




