సామర్లకోట నుంచి వేట్లపాలెం వెళ్లే రోడ్డులో అనుమానాస్పదంగా వెళుతున్న లారీని రెవెన్యూ, వ్యవసాయ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో అనుమానాస్పద లోడుతో వెళుతుందన్న సమాచారం మేరకు సామర్లకోట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, అగ్రికల్చర్ ఏడీఈ దుర్గా లక్ష్మీలు తనిఖీలు చేపట్టగా, లారీ డ్రైవర్ పరారయ్యాడు. లారీలో పొటాషియం ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.