ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అనారోగ్యానికి గురై శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్దే ఉంటున్నారు. ఆయనను మంగళవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం పరామర్శించారు. రాజప్ప నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో తరించాలని వారు ఆకాంక్షించారు.