పెద్దాపురం పట్టణంలో మంగళవారం సాయంత్రం పార్సిల్ సర్వీసులను డీఎస్పీ తిలక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొరియర్ సర్వీసుల ద్వారా ఎగుమతి, దిగుమతి అవుతున్న వస్తువుల రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డీఎస్పీ కొరియర్ నిర్వాహకులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో సీఐ వైఆర్ కె శ్రీనివాస్, ఎస్ఐ మౌనిక కూడా పాల్గొన్నారు.