పెద్దాపురం ఆర్డీవోగా పనిచేస్తూ, సస్పెన్షన్ కు గురైన శ్రీరమణి సస్పెన్షన్ ను ప్రభుత్వం రద్దు చేసింది. వేట్లపాలెం బాణాసంచా పరిశ్రమ ప్రమాదంలో 28 మంది మృతి చెందడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. విజిలెన్స్ నివేదిక, శ్రీరమణి వినతిని పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.