పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం ఆర్డీవో శ్రీ రమణి నిర్వహించిన ప్రజాదర్బార్ కు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్డీవో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల స్థాయిలో కూడా ఇలాంటి వేదికలు నిర్వహిస్తున్నట్లు, ప్రజలు పీజీఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో సూచించారు.