దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన చిగురుపల్లి వివేక్ పదవ తరగతి పరీక్షల్లో 600కు 521 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. దినసరి కూలీ కిరణ్, మాధవిల కుమారుడైన వివేక్ సాధించిన ఈ విజయం తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. ఉపాధ్యాయులు అతని ప్రతిభను అభినందించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.