కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని జీ. రాగంపేట రోడ్డులో ఉన్న జగనన్న కాలనీ వాసులు గత 15 రోజులుగా త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోని వాటర్ ట్యాంక్ మోటారు కాలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా తాత్కాలికంగా నీటిని అందిస్తున్నా, అది సరిపోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి, కొత్త మోటారు ఏర్పాటు చేసి శాశ్వత నీటి సరఫరా పునరుద్ధరించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.