కాకినాడ జిల్లా పోలీసులు శనివారం పలువురు వ్యక్తులు పోగొట్టుకున్న 800 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1.36 కోట్లు ఉంటుందని వెల్లడించారు. కాకినాడ ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఈ ఫోన్లను వాటిని పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. వందల సంఖ్యలో ఉన్న ఈ ఫోన్లను చూస్తే సెల్ఫోన్ దుకాణం అనుకుంటే పొరపాటే.