పిఠాపురం నియోజకవర్గం జగ్గయ్య చెరువుకు చెందిన మట్టం జ్వతి అనే అంధురాలు, తన తండ్రి పేరు మీద కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చినా, ఇప్పటికీ తనకు పెన్షన్ మంజూరు చేయలేదని తెలిపింది. తమకు వెంటనే పెన్షన్ ఇప్పించాలని ఆమె కోరుతోంది.